బ‌న్నీ రీమిక్స్ పాట‌కు సల్మాన్ చిందులు!


బ‌న్నీ రీమిక్స్ పాట‌కు సల్మాన్ చిందులు!
బ‌న్నీ రీమిక్స్ పాట‌కు సల్మాన్ చిందులు!

బ‌న్నీ పాట‌కు సల్మాన్ చిందులేయ‌బోతున్నారా? అంటే అవునే తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన చిత్రం `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. హ‌రీష్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఆడియో ఆల్బ‌మ్ సూప‌ర్‌హిట్‌గా నిలిచింది.

ఈ చిత్రంలోని `సీటీ మార్ సీటీ మార్ ..` అంటూ సాగే పాట‌కు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ స్టెప్పులేయ‌బోతున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `రాధే`. ముంబై అండ‌ర్ వ‌ర‌ల్డ్ నేప‌థ్యంలో ప్ర‌భుదేవా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అతుల్ అగ్నిహోత్రి, సోహైల్‌ఖాన్‌తో క‌లిసి స‌ల్మాన్‌ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిషా ప‌టాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జాకీష్రాఫ్‌, ర‌ణ్‌దీప్ హుడా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` చిత్రంలోని `సీటీ మార్ సీటీ మార్ ..` పాట‌ని రీమిక్స్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే స‌ల్మాన్‌కు ట్యూన్ కూడా వినిపించ‌డంతో గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.