`ఉప్పెన‌` టీమ్‌ని అభినందించిన అల్లు అర్జున్‌!

`ఉప్పెన‌` టీమ్‌ని అభినందించిన అల్లు అర్జున్‌!
`ఉప్పెన‌` టీమ్‌ని అభినందించిన అల్లు అర్జున్‌!

వైష్ణ‌వ్ తేజ్, కృతిశెట్టి హీరో, హీరోయిన్‌లుగా ప‌రిచ‌య‌మైన చిత్రం `ఉప్పెన‌`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ పై న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి, సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రి నోట విన్నా `ఉప్పెన‌` పాట‌లే.. ఈ సినిమాపై చ‌ర్చే. అంత‌గా ఈ మూవీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో మంచి స్థానాన్ని సొంతం  చేసుకుంది. ఈ మూవీ చూసిన చాలా మంది స్టార్ హీరోలు చిత్ర బృందంపై వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి, బుచ్చిబాబుల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్ం కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌త్యేకంగా చూశారు. గ‌త కొంత కాలంగా `పుష్ప‌` షూటింగ్‌తో బిజీగా వున్న ఆయన తాజాగా ఈ మూవీని చిత్ర బృందంతో క‌లిసి చూశారు.

అనంత‌రం చిత్ర బృందంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. తొలి చిత్రంతోనే వైష్ణ‌వ్ తేజ్ అద్భుత‌మైన న‌టుడిగా గుర్తింపుని తెచ్చుకున్నాడ‌ని ప్ర‌శంసించారు. అత‌నికి అద్భుత‌మైన డెబ్యూ దొరికింద‌న్నారు. అలాగే కృతిశెట్టి, విజ‌య్ సేతుప‌తిల న‌ట‌న గురించి ప్ర‌శంస‌లు కురిపించారు. చ‌క్క‌ని పాయింట్‌తో అద్భుతంగా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ప‌నితీరుని మెచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా మైత్రీ సంస్థ‌ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. ఇలాంటి అద్భుత‌మైన సినిమాలు మ‌రిన్ని రావాల‌న్నారు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.