బ‌న్నీ కొత్త ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ!


బ‌న్నీ కొత్త ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ!
బ‌న్నీ కొత్త ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ!

టాలీవుడ్ హీరోల్లో బ‌న్నీ స్టైలే వేరు. నిత్యం కొత్త‌గా వుండాల‌ని ప్ర‌య‌త్నిస్తూ టాలీవుడ్‌కు కొత్త స్టైల్స్‌ని ప‌రిచ‌యం చేస్తున్నారు అల్లు అర్జున్‌. ఈ ఏడాది ప్రారంభంలో `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న బ‌న్నీ రెట్టించిన ఉత్స‌హంతో చేస్తున్న చిత్రం `పుష్ప‌`. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈమూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే బ‌న్నీ మ‌రో కొత్త అడుగు వేయ‌బోతున్నారు.

ఫాద‌ర్ అల్లు అర‌వింద్ నిర్వ‌హిస్తున్న గీతా ఆర్ట్స్  త‌ర‌హాలో కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ని ఏర్పాటు చేయ‌బోతున్నార‌ట‌.  ముందుగా ఈ బ్యాన‌ర్‌పై వెబ్ సిరీస్‌ల‌ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల కోసం కొత్త త‌ర‌హా వెబ్ సిరీస్‌ల నిర్మాణం చేప‌ట్టాల‌నుకుంటున్నార‌ట‌. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే బ‌న్నీ ఓ ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే బ‌న్నీ వెబ్ సిరీస్‌ల నిర్మాణం కేవ‌లం ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా` కోసం నిర్మించ‌బోతున్నార‌ట‌. దీన్ని అల్లు అర‌వింద్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. బ‌న్నీ న‌టిస్తున్న `పుష్ప‌` రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న‌ట్టు తెలిసింది.