అల్లు అర్జున్ మరో కొత్త బిజినెస్ లోకి దిగుతున్నాడా?


Allu Arjun starts new business
Allu Arjun starts new business

ఇప్పటి సినిమా తారలు కేవలం సినిమా పని చూసుకుని ఇళ్లకు వెళ్లిపోయే రకాలు కాదు. సినిమా అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని జూదం. కాబట్టి తమకు బిజినెస్ లు ఉండాలని ఆలోచించే వాళ్ళే ఎక్కువ.  ఈ నేపథ్యంలో పలువురు స్టార్లు సొంతంగా బిజినెస్ లు పెట్టుకుంటున్నారు, మరి కొంత మంది అయితే వేరే వాళ్లతో కలిసి బిజినెస్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా బిజినెస్ లు చేస్తున్న విషయం తెల్సిందే. డైరెక్ట్ గా కాదు కానీ బన్నీకి హైదరాబాద్ లోని పలు పబ్స్ లో వాటాలున్నాయి. అలాగే అల్లు అరవింద్ పెట్టిన ఆహా యాప్ ను ప్రమోట్ చేస్తున్నాడు. దీనికి విడిగానే పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తవ్వగా ఇప్పుడు పరిస్థితులు బాలేని కారణంగా దాన్ని టెలికాస్ట్ చెయ్యట్లేదు.

తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ కార్ల కంపెనీతో బన్నీ డీల్ సెట్ చేసుకున్నాడట. అందులో పార్ట్నర్ షిప్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ కార్ల కంపెనీకి ఫ్రంట్ ఫేస్ గా బన్నీనే ఉంచనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన షోరూమ్ ఓపెనింగ్ కూడా జరగనుంది.

కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడడంతో అల్లు అర్జున్ ఈ ఫ్రీ టైమ్ ను ఇలా ఉపయోగించుకుంటున్నాడన్నమాట. అల వైకుంఠపురములో చిత్రంతో బన్నీ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది. దీని తర్వాత సుకుమార్ తో సినిమాను మొదలుపెట్టాలని భావించాడు. అది వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి చివరికి మార్చ్ సెకండ్ హాఫ్ లో షూటింగ్ కు వెళ్తుంది అనుకుంటే కరోనా ఎఫెక్ట్ తో అది కూడా ఆగిపోయింది. ఈ వైరస్ తగ్గి పరిస్థితులు మాములుగా మారాక ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది.