అల్లు అర్జున్ – సుకుమార్ సినిమా జనవరి నుండేనట!


allu arjun sukumar film shooting from january
allu arjun sukumar film shooting from january

రంగస్థలం సినిమాతో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు సుకుమార్. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్, రంగస్థలం సినిమాతో ఒకేసారి పది  మెట్లు ఎక్కేసాడు. అయితే అంత పెద్ద సక్సెస్ సాధించిన సుకుమార్ కు తర్వాతి సినిమా సెట్ చేసుకోవడానికే ఏడాదిన్నరకు పైగా సమయం పట్టింది. ముందు మహేష్ బాబుతో కథ అనుకోవడం, అది వర్కౌట్ కాకపోవడంతో మళ్ళీ అల్లు అర్జున్ కు కథ చెప్పడం, తను ఓకే చెప్పడం జరిగింది. అయితే ఈ కథ బన్నీ ఓకే చేసి చాలా కాలమే అవుతున్నా ఇంకా షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న కారణంగా సుకుమార్ సినిమా లేట్ అవుతూ వచ్చింది.

మొదట అల వైకుంఠపురములో షెడ్యూల్ ప్రకారం నవంబర్ లో షూటింగ్ పూర్తి చేసుకోవాలి కానీ డిసెంబర్ రెండో వారం వచ్చేసినా కూడా ఇంకా షూటింగ్ పూర్తవ్వలేదు. అందుకే డిసెంబర్ లోనే సుకుమార్ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా, ఇప్పుడు అది జనవరిలోనే జరుగుతుందని సమాచారం. అల వైకుంఠపురములో రిలీజైన వారం, పది రోజులకు ఈ సినిమా పట్టాలెక్కుతుందన్నమాట.

అల్లు అర్జున్ ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. అలాగే ఈ చిత్రం చిత్తూర్ నేపథ్యంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. సుకుమార్ ఇప్పటికే షూటింగ్ చేయడానికి లొకేషన్స్ ను ఫైనల్ చేసేసినట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తోన్న అల వైకుంఠపురములో విషయానికి వస్తే.. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై బంపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా అదిరిపోయే రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. ఇలా అన్నీ పాజిటివ్ గా ఉన్న అల వైకుంఠపురములో కచ్చితంగా హిట్ అవుతుందని ట్రేడ్ కూడా భావిస్తోంది.