అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదేనా?


అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదేనా?
అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ రూపొందిస్తున్న చిత్రంలో న‌టిస్తున్నారు. బ‌న్నీ లేకుండానే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే తాజా షెడ్యూల్‌ని ప్రారంభించ‌బోతున్నారు. ఈ షెడ్యూల్ లో హీరో అల్లు అర్జున్ పాల్గొంటార‌ట‌. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర ప‌క్కా గ్రామీణ యువ‌తిగా వుంటుంద‌ని తెలిసిది.

మ‌రో కీల‌క పాత్ర‌లో విలన్‌గా త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నారు. బ‌న్నీ – విజ‌య్ సేతుప‌తి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌ట‌. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో అత్యంత స‌హ‌స‌త్వంగా ఈ సినిమా తెర‌పైకి రాబోతోంది. ఇదిలా వుంటే ఈ చిత్ర టైటిల్ ఫ‌స్ట్‌లుక్‌ని బ‌న్నీ పుట్టిన రోజైన బుధ‌వారం రిలీజ్ చేయ‌బోతున్నామంటూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. దీంతో టైటిల్ ఏంటి? .. ఎలా వుంటుంది? అనే చ‌ర్చ‌మొద‌లైంది.

మంగ‌ళ‌వారం ఈ చిత్ర టైటిల్ `పుష్ప‌` అని, హీరోయిన్ చుట్టూ సాగే క‌థ కాబ‌ట్టి హీరోయిన్‌కున్న ప్రాధాన్య‌త‌ను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ఈ టైటిల్‌నే ఫైన‌ల్ చేయ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో ఈ న్యూస్ వైర‌ల్‌గా మారింది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మన్న‌ది తెలియాలంటే బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు వేచి చూడాల్సిందే.