స్టైలిష్ స్టార్ `పుష్ప‌` ఫ‌స్ట్‌లుక్‌ టెర్రిఫిక్


స్టైలిష్ స్టార్ `పుష్ప‌` ఫ‌స్ట్‌లుక్‌ టెర్రిఫిక్
స్టైలిష్ స్టార్ `పుష్ప‌` ఫ‌స్ట్‌లుక్‌ టెర్రిఫిక్

`అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రం ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత అల్లు అర్జున్ మైండ్‌సెట్ మారిపోయింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే సుకుమార్‌తో చేస్తున్న చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయి చిత్రంగా మ‌లుస్తున్నారు. బ‌న్నీ – సుకుమార్ క‌లయిక‌లో ఓ భారీ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్‌, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. ఈ చిత్రానికి `పుష్న‌` టైటిల్‌ని ఫిక్స్ చేశారు. బుధ‌వారం బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నారు. అంటే పాన్ ఇండియా స్థాయిలో అన్న‌మాట‌. ఇప్ప‌టి వ‌ర‌కు అల్లు అర్జున్‌, సుకుమార్‌ల క‌ల‌యిక‌లో ఆర్య‌, ఆర్య -2 చిత్రాలొచ్చాయి. తాజాగా వ‌స్తున్న చిత్రం మూడ‌వ‌ది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. `రంగ‌స్థ‌లం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత ఆస్థాయి సినిమా చేయాల‌ని బ‌న్నీ ప‌ట్టుబ‌ట్ట‌డంతో తెర‌పైకొచ్చిన స్క్రిప్ట్ ఇది.

గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌గా ఊర‌మాస్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, టైటిల్‌ని బ‌ట్టి చూస్తే ఇందులో బ‌న్నీ చ‌దువురాని వ్య‌క్తిగా ర‌గ్గ‌డ్ పాత్ర‌లో క‌నిపిస్తున్నట్టు తెలుస్తోంది. గుబురు గ‌డ్డం, గుబురు మీసం జుల‌పాల జుట్టు, 90వ ద‌శ‌కం కాలం నాటి ష‌ర్ట్ డిజైన్‌..ని చూస్తుంటే ఇదొక పిరియాడిక్ స్టోరీలా తెలుస్తోంది.  సినిమాలో బ‌న్నీ పాత్ర పేరు పుష్ప‌రాజ్‌. అందుకే ఈ చిత్రానికి `పుష్ప‌`అని పెట్టారు. క‌రోనా వైన‌స్ విజృంభించ‌డంతో లాక్ డౌన్ కార‌ణంగా అన్నీ బంద్ చేశారు. దీంతో సినిమాల షూటింగ్‌లు కూడా నిలిపివేయ‌డంతో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగిపోయింది. త్వ‌ర‌లోపే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.

Credit: Twitter