ఐకాన్ తర్వాత బన్నీ చేయబోయే సినిమా అదేనా?


ఐకాన్ తర్వాత బన్నీ చేయబోయే సినిమా అదేనా?
ఐకాన్ తర్వాత బన్నీ చేయబోయే సినిమా అదేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో వంటి భారీ హిట్ తర్వాత చేయబోతున్న చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుకావాల్సింది. అయితే వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మార్చ్ నుండి షూటింగ్ మొదలవుతుంది అనుకుంటే లాక్ డౌన్ కారణంగా రెండు నెలల నుండి పుష్ప టీమ్ ఖాళీగానే ఉంది. వచ్చే నెల నుండి షూటింగ్స్ ను అనుమతులిచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పుష్ప టీమ్ డేట్స్ విషయంలో తర్జనభర్జనలు పడుతోంది. ఈ సినిమా వచ్చే నెల నుండి మొదలైతే వచ్చే వేసవికి సినిమాను విడుదల చేసేలా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేయాలని అల్లు అర్జున్ – సుకుమార్ భావిస్తున్నారు.

పుష్ప తర్వాత బన్నీ ఐకాన్ సినిమాకు కమిటైన విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి ఏడాది చివరికి ఐకాన్ ను విడుదల చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. మరి ఐకాన్ తర్వాత బన్నీ చేయబోయే సినిమా విషయంలో ఇప్పటికే పలు రూమర్లు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం బన్నీ సురేందర్ రెడ్డితో కలిసి సినిమా చేసే అవకాశం ఉందిట. వీరిద్దరూ కలిసి గతంలో చేసిన రేసు గుర్రం ఎంత భారీ విజయం సాధించిందో మనందరం చూసాం. సో వీరిద్దరి కలయికపై కచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి. గతేడాది సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి, మరోసారి స్టార్ హీరోతోనే సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాడు. పలువురు స్టార్ హీరోలకు కథలు వినిపించినా వారు ఖాళీగా లేరు. ఇక అల్లు అర్జున్ కూడా ఖాళీగా లేకపోయినా తనకే సురేందర్ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. ఈ కాంబో గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.