అల్లు అర్జున్ మళ్ళీ సుకుమార్ తో


Allu arjun team up again with sukumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . ఇంతకుముందు అల్లు అర్జున్ – సుకుమార్ ల కాంబినేషన్ లో ఆర్య వంటి బ్లాక్ బస్టర్ రాగా దానికి సీక్వెల్ గా ఆర్య 2 చేసారు అయితే ఆర్య స్థాయిలో ఆర్య 2 ఆడలేదు కట్ చేస్తే ఇద్దరికి చాలా గ్యాప్ వచ్చింది . మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత సుకుమార్ తో అల్లు అర్జున్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు .

 

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు . ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కు ఇరవయ్యో సినిమా కావడం విశేషం . ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ కు ఇది మూడో సినిమా కాగా సుకుమార్ తో కూడా అల్లు అర్జున్ కు మూడో సినిమా కావడం విశేషం . అల్లు అర్జున్ – సుకుమార్ ల సినిమా ఈఏడాది లోనే సెట్స్ మీదకు వెళ్లనుంది .

English Title: Allu arjun team up again with sukumar