హ్యాట్రిక్ కోసం అతడికి హ్యాండ్ ఇస్తున్నాడా


Allu arjun teamup once again trivikram

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఘోర పరాజయం పొందడంతో తదుపరి సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్ . అయితే మనం వంటి విభిన్న కథా చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని చాలాకాలంగా అంటున్నారు కానీ అది మాత్రం వర్కౌట్ కావడం లేదు . విక్రమ్ కథ చెబుతున్నాడు బన్నీ మార్పులు చెబుతున్నాడు అలా సీరియల్ లా ఆ వ్యవహారం సాగుతోంది తప్ప కొలిక్కి మాత్రం రావడం లేదు . దాంతో ఇక విక్రమ్ కుమార్ కు అల్లు అర్జున్ హ్యాండ్ ఇచ్చినట్లే అని అంటున్నారు .

ఎందుకంటే త్రివిక్రమ్ తో తన తదుపరి సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు అల్లు అర్జున్ . ప్రస్తుతం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది . మరో రెండు వారాలు ఓపిక పడితే అరవింద సమేత రిలీజ్ అవుతుంది ఫలితం కూడా వస్తుంది కాబట్టి త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ ఉత్సాహపడుతున్నాడట అల్లు అర్జున్ . ఇంతకుముందు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి . జులాయి పెద్ద హిట్ కాగా సన్నాఫ్ సత్యమూర్తి కూడా మంచి విజయాన్నే అందుకుంది దాంతో హ్యాట్రిక్ కోసం అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ట్రై చేస్తున్నారు .

English Title: Allu arjun team up once again trivikram