రౌడీ క్ల‌బ్‌లో చేరిన స్టైలిష్‌స్టార్‌!

రౌడీ క్ల‌బ్‌లో చేరిన స్టైలిష్‌స్టార్‌!
రౌడీ క్ల‌బ్‌లో చేరిన స్టైలిష్‌స్టార్‌!

టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఒకే ఒక్క మూవీ `అర్జున్‌రెడ్డి`తో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌న క్రేజ్‌నే బ్రాండ్‌గా మార్చి `రౌడీ` బ్రాండ్ పేరుతో క్లాతింగ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. దాన్ని రౌడీ క్ల‌బ్ పేరుతో మ‌రింత‌గా పాపుల‌ర్ చేస్తున్నాడు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అనుగునంగా డ్రెస్సింగ్ స్టైల్‌ని డిజైన్ చేయించి మార్కెట్‌లోకి వదిలాడు.

తాజాగా ఈ డ్రెస్ డిజైన్ స్టైల్ బ‌న్నీని విప‌రీతంగా ఎట్రాక్ట్ చేసింది. దీంతో బ‌న్నీ కూడా రౌడీ క్ల‌బ్‌లో చేరిపోయాడు. గురువారం ఉద‌యం విజ‌య్ దేవ‌ర‌కొండ అండ్ టీమ్ ప్ర‌త్యేకంగా డిజైన్ చేసి పంపించిన డ్రెస్‌ని వేసుకున్న బ‌న్నీ ఆ ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. బ్లూ క‌ల‌ర్ రౌడీ వేర్‌లో బ‌న్నీ కూల్‌గా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు.

ఈ డ్రెస్‌పై రౌడీ క్ల‌బ్ అని ప్రింట్ చేసి డిజైన్‌గా వుంది. ఈ డ్రెస్‌ని త‌న‌కు పంపించినందుకు ఈ సంద‌ర్భంగా బ‌న్నీ హీరో విజ‌య్‌కి అత‌ని టీమ్‌కి ప్ర‌త్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. `నేను నా సోదరుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఈ చల్లని డ్రెస్‌ని నాకు పంపిన బృందానికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. ఇది చాలా సౌకర్యంగా ఉంది. నా సోదరుడు విజ‌య్ ఆత్మీయా పూర్వ‌క స్పంద‌న‌కు ధన్యవాదాలు` అని బ‌న్నీ ట్వీట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)