అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తోన్న అల్లు అర్జున్అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తోన్న అల్లు అర్జున్
అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తోన్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ అవ్వకూడదన్న పట్టుదలతో ఉన్నాడు బన్నీ. సహజంగా సక్సెస్ రేట్ ఎక్కువున్న బన్నీ లాస్ట్ రెండు సినిమాల పరంగా కొంచెం డౌన్ అయ్యాడు. ముఖ్యంగా ఎంతో నమ్మి, ఎంతో కష్టపడి చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్లాప్ అవ్వడం బన్నీకి పెద్ద ఎదురుదెబ్బలా ఫీలయ్యాడు. ఎందుకంటే ఈ స్టోరీపై పలువురు సందేహాలు వ్యక్తం చేసినా వక్కంతం వంశీని నమ్మి అల్లు అర్జున్ ఆ సినిమా చేసాడు. సినిమా పోయినదానికంటే తను నమ్మింది తప్పన్న నిజం బన్నీని బాధించింది. అందుకే ఆరు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్నాడు. తనకు రెండు హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే జత కట్టాడు. అల వైకుంఠపురములో చిత్రాన్ని చేస్తున్నాడు.

అందుకే ఈ చిత్ర ప్రమోషన్స్ విషయంలో కూడా దూకుడు మీద ఉన్నారు. అసలు అల వైకుంఠపురములో విషయంలో ఇంత దూకుడుగా ఉండాలన్న నిర్ణయం అల్లు అర్జున్ దే అని తెలుస్తోంది. సాధారణంగా చేసే ప్రమోషన్స్ కు విభిన్నంగా, రిలీజ్ కు నాలుగు నెలల ముందు నుండే ప్రమోషన్స్ షురూ చేయాలని డిసైడ్ చేసాడు. ముందుగానే అందరికీ క్యాచీగా ట్యూన్లు ఇవ్వాలని థమన్ ను డిమాండ్ చేసాడు. అనుకున్నట్లుగానే థమన్ అల వైకుంఠపురములో లో సామజవరగమన, రాములో రాముల పాటలు సూపర్ క్యాచీగా ఇచ్చాడు. ఈ రెండు పాటలూ కలిపి దాదాపు 140 మిలియన్ వ్యూస్ సాధించాయంటే ఎంత పెద్ద హిట్ అయ్యాయో అర్ధం చేసుకోవచ్చు. ఇలా బన్నీ ప్లాన్ ప్రకారమే అల వైకుంఠపురములో ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

ఈ తరహాలోనే అల్లు అర్జున్ సుకుమార్ తో తాను చేయబోయే నెక్స్ట్ సినిమాను కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇటీవలే అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాకు సంబంధించిన ముహూర్తం జరిగింది. షూటింగ్ కూడా త్వరలో మొదలవుతుందని తెలుస్తోంది. అల వైకుంఠపురములో తరహాలోనే చాలా ముందుగా ఈ చిత్రానికి పాటలు కావాలని దేవి శ్రీ ప్రసాద్ ను బన్నీ కోరాడు. ప్రస్తుతం దేవి కూడా ఆ పని మీదే ఉన్నాడు. దేవితో ముందు పనిచేసిన దర్శకులు అందరూ ఒక్కొక్కరుగా అతణ్ణి పక్కన పెడుతున్నా సుకుమార్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. అల్లు అర్జున్ కు ఎప్పుడూ దేవి మంచి పాటలే ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. అలాగే సుకుమార్ – దేవి ది గోల్డెన్ కాంబినేషన్. అందుకే దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు ఇచ్చి తన పని ఇంకా పూర్తవ్వలేదని నిరూపించుకునే పనిలో ఉన్నాడు. అల వైకుంఠపురములో చిత్రం జనవరి 12న విడుదల అవ్వనుండగా సుకుమార్ – అల్లు అర్జున్ సినిమాను దసరాకు విడుదల చేయాలని భావిస్తున్నారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది.