కార్తికేయ కోసం స్టైలిష్ స్టార్ వ‌చ్చేస్తున్నాడు!

కార్తికేయ కోసం స్టైలిష్ స్టార్ వ‌చ్చేస్తున్నాడు!
కార్తికేయ కోసం స్టైలిష్ స్టార్ వ‌చ్చేస్తున్నాడు!

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `చావు క‌బురు చల్ల‌గా`. కార్తీకేయ గుమ్మ‌కొండ హీరోగా న‌టిస్తున్నారు. కౌశిక్ పెగ‌ళ్ల పాటి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌క్సెస్‌ఫుల్ యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బ‌స్తీ బాల‌రాజుగా ప‌క్కా మాస్ పాత్ర‌లో కార్తికేయ న‌టిస్తుండ‌గా న‌ర్స్ పాత్ర‌లో లావ‌ణ్య త్రిపాఠి క‌నిపించ‌బోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర లిరిక‌ల్ వీడియోలు ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. కార్తీకేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రీ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంద‌ని ఈ మూవీ కోసం చాలా మంది ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఈ నెల 9న నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి అల్లు అర్జున్ స్పెష‌ల్ గెస్ట్‌గా రాబోతున్నారు. ఈ విష‌యాన్ని నిర్మాత బ‌న్నీవాసు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్‌ని కూడా మేక‌ర్స్ రిలీజ్ చేశారు. బ‌న్నీ చీఫ్ గెస్ట్‌గా హీజ‌రు కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ని అత్యంత గ్రాండ్‌గా నిర్వ‌హించ‌డానికి టీమ్ ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసింది. ఈ చిత్రాన్ని ఈ నెల 19న రిలీజ్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే.