ఆరోజే అల్లు అర్జున్-త్రివిక్రమ్ చిత్రం టైటిల్ రివీల్!!


Allu Arjun Trivikram Srinivas New Movie Title
Allu Arjun Trivikram Srinivas New Movie Title

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తోన్న చిత్రం ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అల్లు అర్జున్ నటిస్తోన్న 19వ చిత్రం ఇది. పూజ హేగ్దే కథానాయికగా నటిస్తోంది.

కాగా ఈ చిత్రం టైటిల్ ని పంద్రాగష్ట్ న ఎనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రం టైటిల్ ఏమై ఉంటుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొని వుంది. వాటన్నీటికి తెరదించుతూ.. ఆగస్ట్ 15న టైటిల్ ప్తకటించనున్నారు చిత్ర యూనిట్.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్సఆఫీసు వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. వీరి కాంబినేషనల్ వస్తోన్న ఈ చిత్రం హ్యాట్రిక్ అవుతుందని అభిమానులు ఊహిస్తున్నారు.

అల్లు అర్జున్ సరికొత్త క్యారెక్టరైజేషన్ లో కనిపిస్తారని.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ పొందిస్తున్నారని చిత్ర యూనిట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. అల్లు అర్జున్-పూజ హేగ్దే కలయికలో వచ్చిన డీజే దువ్వాడ జగన్నాధం చిత్రం తరువాత మరోసారి ఇద్దరు నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏమేరకు సక్సెస్ అవుతోందో చూడాలి మరి..!!