అల్లు అర్జున్ టైటిల్ వైకుంఠాపురంలో 


allu arjun
allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రానికి ఎల్లుండి ఆగస్టు 15 న టైటిల్ ఫిక్స్ చేయనున్నారు . స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో టైటిల్ ని ప్రకటించనున్నారు . టైటిల్ ప్రకటించనున్న నేపథ్యంలో కొత్త టైటిల్ వెలుగులోకి వచ్చింది . ఇప్పటికే అలకనంద , నాన్న నేను అనే పేర్లు వినిపిస్తుండగా తాజాగా వినబడుతున్న టైటిల్ ”వైకుంఠాపురంలో  ” అనే టైటిల్ వినబడుతోంది .

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా ఇది మూడో సినిమా దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక ఈ చిత్రాన్ని 2020 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక టైటిల్ ఏంటి అన్నది ఆగస్టు 15 న తేలనుంది .