పెద్ద హీరోలు ఎవరికీ వారు వారి సొంత నిర్మాణ సంస్థలు పెట్టేసుకుంటున్నారు.


పెద్ద హీరోలు ఎవరికీ వారు వారి సొంత నిర్మాణ సంస్థలు పెట్టేసుకుంటున్నారు.
పెద్ద హీరోలు ఎవరికీ వారు వారి సొంత నిర్మాణ సంస్థలు పెట్టేసుకుంటున్నారు.

అల్లు వారి కుటుంబం మాత్రం ఈ సంవత్సరం గట్టిగా వార్తల్లో నిలిచింది. అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇంకా వారి తండ్రి అల్లు అరవింద్ కూడా నెలకి ఒకసారి వార్తలో నిలిచారు. సైరా ఆడియో లాంచ్ లో అల్లు అర్జున్ రాలేదని. గీత ఆర్ట్ బ్యానర్ విడిపోయిందని, అల్లు శిరీష్ సినిమాలు ఆడట్లేదు ఇక అతను సినిమాలు చేయకపోవడమే మంచిది అని……

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి. కుటుంబం పెద్ద ‘అల్లు బాబీ’ కూడా కొత్త నిర్మాణ సంస్థ పెట్టి ‘వరుణ్ తేజ్’ తో ‘బాక్సర్’ సినిమాని స్టార్ట్ చేసేసాడు. అల్లు అరవింద్ గారేమో తన ఆస్తి ని కొడుకులకి సమానంగా పంచేసారు. చూస్తుంటే ఇదంతా పెద్ద సమస్యే అని అనిపిస్తుంది. కానీ వారి కుటుంబంలో ఎన్ని గొడవలు జరిగిన మీడియా వారు మాత్రం ఒకటికి 10 అనుకోని రాయటం మామూలే కదా. అందుకే అల్లు కుటుంబం వారు కూడా అవేమి పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.

ఇక పోతే అల్లు అరవింద్ గారి ‘గీత ఆర్ట్స్ బ్యానర్’ మొదట నుంచి అల్లు శిరీష్ చూసుకోవాలి అని అరవింద్ గారు అనుకున్నారు. కానీ శిరిష్ గారికి నిర్మాణం కంటే సినిమాలో హీరో గా చెయ్యాలి అనుకోని ట్రాక్ మార్చేశారు. అల్లు బాబీ గారేమో సొంతంగా నిర్మాణం పెట్టేసే సరికి ఇక ‘గీత ఆర్ట్స్’ బాధ్యతలు మన అల్లు అర్జున్ గారు చేపట్టారు. అందుకే సంక్రాంతికి రాబోతున్న ‘అలా వైకుంఠపురములో’ సినిమాలో గీత ఆర్ట్స్ ని భాగస్వామ్యం చేసారు. ఈ ఒక్క సినిమాకే కాదు చేయబోయే సినిమాలన్నిటిలో కూడా గీత ఆర్ట్స్ ని దింపాలని చూస్తున్నాడు.

తన మిత్రుడైన బన్నీ వాసు తో కలిపి మిగిలిన సినిమాలని నిర్మించాలని డిసైడ్ అవుతున్నారు. రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు వీరు కూడా తమ సొంత బ్యానెర్లలో సినిమాలు చేసుకుంటూ ఇతర సినిమాలన్నీ నిర్మిస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ గారు కూడా వారి దారిలో వెళ్ళబోతున్నారు అని, దానికి తగిన జాగ్రతలు బాధ్యతగా తీసుకుంటున్నారు అని ఫిలిం నగర్లో ఈ వార్త తెగ హడావిడి చేస్తుంది.