కేసీఆర్ పై ఆగ్రహంగా ఉన్న అల్లు అర్జున్ మామ


Allu arjun uncle chandrasekhar reddy angry on KCRఅల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఆగ్రహంగా ఉన్నాడు . గత ఎన్నికల్లో 2014 లో తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున అసెంబ్లీ కి పోటీ చేసాడు కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి . అయితే ఆ తర్వాత తెలంగాణలో ఏర్పడిన రాజకీయ కారణాలతో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని టిఆర్ఎస్ లో చేర్చుకున్నాడు కేసీఆర్ , అప్పుడే అల్లు అర్జున్ మామకు కోపం వచ్చింది కానీ కేసీఆర్ హామీ ఇవ్వడంతో మిన్నకుండిపోయాడు . కట్ చేస్తే తాజాగా మళ్ళీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి కే టికెట్ ఇవ్వడంతో కేసీఆర్ పై ఆగ్రహంగా ఉన్నాడు .

అందుకే ఇక టిఆర్ఎస్ పార్టీలో ఉండి వేస్ట్ అని నిర్దారించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు . అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అల్లు అర్జున్ మామకు టికెట్ ఇస్తారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . అయితే కాంగ్రెస్ టికెట్ ఇస్తే మాత్రం అల్లు అర్జున్ మామ తరుపున ప్రచారం చేస్తాడా ? అది కూడా పెద్ద ప్రశ్నే ! ఎందుకంటే గత ఎన్నికల్లో మామ తరుపున అల్లు అర్జున్ ప్రచారం చేయలేదు అలాంటిది ఇప్పుడు చేస్తాడా ? అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూతురు అన్న విషయం తెలిసిందే .

English Title: Allu arjun uncle chandrasekhar reddy angry on KCR