అల్లు అర్జున్ ఆ సినిమాని క్యాన్సిల్ చేసాడట


allu arjun vikram kumar movie cancelled

నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో బిగ్ షాక్ కి గురయ్యాడు అల్లు అర్జున్ . ఎంతో నమ్మకంతో చేసిన ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తదుపరి సినిమా ఏది చేయాలో తెలీక పాలుపోతున్నాడు ఈ హీరో . తదుపరి సినిమా ఇది అని ఫైనల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు కట్ చేస్తే ఇప్పుడేమో విక్రమ్ కుమార్ సినిమాని కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది . ఇష్క్ , మనం వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్ తో సినిమా చేయడానికి తీవ్ర సతమతం అనంతరం ఓకే చేసాడు కట్ చేస్తే ఇక త్వరలోనే అధికారికంగా ప్రకటించి సెట్స్ పైకి వెళ్తారేమో అని అనుకుంటున్న సమయంలో విక్రమ్ తో సినిమాని అల్లు అర్జున్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది .

అల్లు అర్జున్ ఇంత తికమక పడటానికి కారణం నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా డిజాస్టర్ కావడమే ! పైగా విక్రమ్ కుమార్ చేసిన సినిమాల వల్ల కొంత పేరు వస్తుందేమో కానీ హీరోగా మాత్రం కమర్షియల్ హిట్ కొట్టలేను అని డిసైడ్ అయ్యాడట ! అందుకే మరో కమర్షియల్ సినిమా చేయాలనీ అనుకుంటున్నాడట అల్లు అర్జున్ . త్రివిక్రమ్ తో ఎలాగూ సినిమా ఉంది కాబట్టి దాని కంటే ముందు ఖచ్చితంగా ఓ హిట్టు ఉండాలని అందుకు విక్రమ్ కంటే మరోదర్శకుడు బెటర్ అని ఆ సినిమాని క్యాన్సిల్ చేసాడట అల్లు అర్జున్ .

English Title: allu arjun vikram kumar movie cancelled