అల్లు అర్జున్ పరామర్శ


Allu arjun visited brahmanandam

అల్లు అర్జున్ హాస్య నటుడు బ్రహ్మానందం ని పరామర్శించాడు . గతనెలలో బ్రహ్మానందం అనారోగ్యానికి గురి కావడంతో ముంబై లో హార్ట్ సర్జరీ జరిగింది . సర్జరి విజయవంతం కావడంతో బ్రహ్మానందం వేగంగా కోలుకుంటున్నాడు . ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మానందం ని అల్లు అర్జున్ కలిసి పరామర్శించాడు . త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో నటించాలని ఆకాంక్షించాడు అల్లు అర్జున్ .

 

అల్లు అర్జున్ – బ్రహ్మానందం ల కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చాయి . టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టార్ డం బ్రహ్మానందం సొంతం .  తాజాగా అల్లు అర్జున్  త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు . ఇప్పటికే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా రెండు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి . 

English Title: Allu arjun visited brahmanandam