సైరా నరసింహారెడ్డి కోసం అల్లు అర్జున్


Allu arjun voice over for syeraa narasimhareddy

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు . మెగాస్టార్ సినిమా కావడంతో ఆ సినిమాలో నటించాలని తహతహలాడే వాళ్ళు చాలామందే ఉంటారు అయితే అందరికీ ఆ ఛాన్స్ రాదు ఎందుకంటే సరైన పాత్ర లభించాలి , అందుకే అల్లు అర్జున్ సైరా లో నటించకుండా తన వాయిస్ ని ఇవ్వడానికి సిద్దమయ్యాడట . సైరా నరసింహారెడ్డి చిత్రానికి దర్శకులు సురేందర్ రెడ్డి అన్న విషయం తెలిసిందే . ఇంతకుముందు అల్లు అర్జున్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రేసుగుర్రం అనే బ్లాక్ బస్టర్ వచ్చింది .

దాంతో సురేందర్ రెడ్డి తన ఐడియాని చరణ్ కు చెప్పాడట . అలా చిరంజీవి దగ్గరకు వెళ్ళింది , ఇక చిరు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ తో సినిమా ఉంటే బాగుంటుందని సురేందర్ రెడ్డి ఇచ్చిన సలహా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారట . చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది సైరా నరసింహారెడ్డి చిత్రం . ఇక ఈ చిత్రాన్ని 2019 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Allu arjun voice over for syeraa narasimhareddy