విజ‌య్ దేవ‌ర‌కొండ బాట‌లో అల్లు అర్జున్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ బాట‌లో అల్లు అర్జున్‌!
విజ‌య్ దేవ‌ర‌కొండ బాట‌లో అల్లు అర్జున్‌!

టాలీవుడ్ హీరోలు మల్టీప్లెక్స్ రంగంలోకి ప్ర‌వేశిస్తున్నారు. సొంత థియేట‌ర్లను కలిగి ఉండాల‌నే ధోరణిని అనుసరిస్తున్నట్లు గా  తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం AMB సినిమాస్ పేరుతో ఏషియ‌న్ సినిమాస్‌తో క‌లిసి గ‌చ్చిబౌలిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ని ప్రారంభించి ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇలా థియేట‌ర్ రంగంలోకి ప్ర‌వేశించిన మొదటి వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఆయ‌న‌ని ఫాలో అవుతూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఏషియ‌న్ సినిమాస్‌తో క‌లిసి మల్టీప్లెక్స్ వింగ్‌లోకి ఎంట‌ర‌వుతున్నారు. ఎవిడి సినిమాస్ పేరుతో త‌న సొంత పట్టణం మహబూబ్ నగర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ సొంత మ‌ల్టీప్లెక్స్ సిద్ధమవుతోంది. ఇదే బాట‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ రంగంలోకి ప్ర‌వేశిస్తున్నారు. మ‌హేష్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల త‌ర‌హాలోనే ఏషియ‌న్ సినిమాస్‌తో క‌లిసి బ‌న్నీ AAA  సినిమాస్ పేరుతో మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ని ప్రారంభించ‌బోతున్నారు.

ప్ర‌స్తుంత ఈ థియేట‌ర్‌కు సంబంధించిన నిర్మాణ ప‌నులు జోరుగా జ‌రుగుతున్నాయి. అది కూడా మంచి సెంట‌ర్‌గా పేరున్న అమీర్‌పేట్‌లో కావ‌డం విశేషం. నిర్మాణ ద‌శ‌లో వున్న‌ ఈ మ‌ల్టీప్లెక్స్‌కి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుంత సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇది త్వ‌ర‌లోనే సిద్ధం కానున్న‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం బన్నీ ‘పుష్ప’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ చిత్రానికి విలన్ గా మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్‌ని ఫైన‌ల్ చేశారు.