పవన్ కళ్యాణ్ ఎర్ర కండువా…అల్లు అర్జున్ ఎర్ర దుప్పట్టా….


ala vaikuntapuramulo
ala vaikuntapuramulo

మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్‘మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో రాబోతున్న  వారి మూడవ సినిమా “అలా వైకుంఠపురములో”. సినిమా మీద అల్లు అర్జున్ అభిమానులకి ఎంత ఆసక్తి ఉందొ? అంతే అభిమానం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద కూడా ఉంది. అంతలా ఆయన సినిమాలోని మాటలకి మరియు పంచ్ డైలాగ్స్ లోని ప్రాసలకి ప్రాముఖ్యత ఇస్తారు ఎవ్వరైనా.

సినిమాలో అల్లు అర్జున్ గారు రెండు విభిన్నమైన వేషధారణలతో షేడ్స్ కలిగి ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు అని అంటున్నారు త్రివిక్రమ్ గారు. సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా “పూజ హెగ్డే”మరియు “నివేత పెతురాజ్” నటిస్తున్నారు. హిందీ నటి ‘టబు’ సినిమాలో కీలక పాత్రలో దర్శనం ఇవ్వనున్నారు. ఇంకా సినిమాలో సుశాంత్, మురళి శర్మ, నవదీప్, రాహుల్ రామ కృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

గీత ఆర్ట్స్ మరియు త్రివిక్రమ్ గారికి అత్యంత దగ్గర అయినా హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానెర్ల మీద అల్లు అరవింద్ మరియు కె.రాధాకృష్ణ గారు నిర్మిస్తున్నారు. ‘ఎస్.ఎస్.థమన్’ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలోని ఒక పోస్టర్ ని రేపు విజయదశమి కానుకగా విడుదల చేసారు. అందులో అల్లు అర్జున్ ని చూస్తుంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేలా ఉంది.

మొన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న అల్లు అర్జున్ ని చూపించిన సినిమా సభ్యులు ఈరోజు ఏకంగా కోపంతో రగిలి పోతున్న, శత్రువులని కింద పడేసి కొట్టేస్తున్న అల్లు అర్జున్ చేతిలో ‘ఎర్ర దుప్పట్టా’ పట్టుకున్న పోస్టర్ ని చూపించారు. మరి ఇది వరకు ‘పవన్ కళ్యాణ్‘ గారు ఎర్ర కండువా లాగ అల్లు అర్జున్ ఎర్ర దుప్పట్టా ఎంత ఫేమస్ అవుతుందో ట్విట్టర్ లో ట్రేండింగ్ ని బట్టి చెప్పేయొచ్చు.