అల్లు అర్జున్ కల నెరవేర్చుతున్న చిరంజీవి


Allu arjuns dreams come true మేనమామ మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు అల్లు అర్జున్ కల నెరవేర్చుతున్నాడు , అల్లు అర్జున్ కల ఏంటి ? చిరంజీవి ఆ కల తీర్చడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? 149 సినిమాలను హాయిగా ఆడుతూ పాడుతూ చేసేసిన చిరంజీవి 150 వ సినిమాగా ”ఎపిక్ ” మూవీ చేస్తాడని అనుకున్నాడట అల్లు అర్జున్ అయితే అందుకు భిన్నంగా తీవ్ర తర్జన భర్జన ల అనంతరం తమిళ రీమేక్ చేసాడు , ఖైదీ నెంబర్ 150 అని అది పెద్ద హిట్ అయ్యింది కానీ చిరంజీవి 150 వ సినిమా అంటే చారిత్రాత్మక సినిమానో , జానపదమో ?లేక ఏదైనా స్వాతంత్య్ర సమరయోధుడు సినిమానో అని అనుకుంటారు అందరూ కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ రీ ఎంట్రీ లో సేఫ్ జోన్ సినిమాని ఎంచుకున్నాడు దాంతో కాస్త నిరాశపడ్డాడట అల్లు అర్జున్ అందుకే అంటున్నాడు ఖైదీ నెంబర్ 150 చిత్రం అభిమానుల కోసం తీసాడు ఇక ఇప్పుడు నా కల అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం చేస్తున్నాడు అని .

అసలు 150 వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్నే ఎంచుకున్నాడు ముందుగా కానీ ఎక్కడో అనుమానం దాంతో రిస్క్ ఎందుకని తమిళ రీమేక్ కు ఓటేశాడు . కట్ చేస్తే నిన్న విడుదలైన సైరా …… నరసింహారెడ్డి టీజర్ తో ఒక్కసారిగా మెగా అభిమానులు ఉలిక్కి పడ్డారు . ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అంటూ పండగ చేసుకుంటున్నారు . ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో మెగా అభిమానులు సంతోషంగా పండగ చేసుకుంటున్నారు .

English Title: allu arjuns dreams come true