అల్లు ఫ్యామిలీ కూడా స్టూడియో నిర్మిస్తోంది!


అల్లు ఫ్యామిలీ కూడా స్టూడియో నిర్మిస్తోంది!
అల్లు ఫ్యామిలీ కూడా స్టూడియో నిర్మిస్తోంది!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ఫ్యామిలీల‌కు మాత్ర‌మే స్టూడియోలున్నాయి. అందులో ద‌గ్గుబాటి ఫ్యామిలీకి రామానాయుడు స్టూడియోస్ వుండ‌గా అక్కినేని ఫ్యామిలీకి అన్న‌పూర్ణ స్టూడియోస్ వుంది. ఆ త‌రువాత సూప‌ర్‌స్టార్ ఫ్యామిలీకి ప‌ద్మాల‌యా స్టూడియోస్ వున్న విష‌యం తెలిసిందే. మెగా ఫ్యామిలీకి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఫిల్మ్ స్టూడియో లేదు. త్వ‌ర‌లోనే మెగాస్టార్ చిరంజీవి వైఆగ్‌లో భార స్థాయిలో ఓ ఫిల్మ్ స్టూడియోని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు ఎన్‌. శంకర్ కోసం స్టూడియోకు ఐదెక‌రాలు కేటాయించ‌గా ఇప్ప‌టికీ దానిపై వివాదం న‌డుస్తోంది. వి. వి.వినాయ‌క్ కూడా సిటీ ఔట్ స్క‌ర్ట్స్‌లో స్టూడియో నిర్మాణం చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే అల్లు వారి ఫ్యామిలీ కూడా ఫిల్మ్ స్టూడియోని నిర్మించ‌బోతోంది. ఈ విష‌యాన్ని గురువారం ప‌ద్మ‌శ్రీ అల్లు రామ‌లింగ‌య్య 99వ జ‌యంతి సంద‌ర్భంగా అల్లు ఫ్యామిలీ ప్ర‌క‌టించింది. అల్లు రామ‌లింగ‌య్య చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన అల్లు ఫ్యామిలీ మెంబ‌ర్ అల్లు అర‌వింద్ త‌న‌యులు అల్లు వెంక‌ట్, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూ ఓ లోగో పోస్ట‌ర్‌ని కూడా సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‌

ఈ స్టూడియోని అల్లు అర్జున్ నిర్మించ‌బోతున్నారు. భారీ చిత్రాల నిర్మాణానికి అనువుగా ఈ స్టూడియోని తీర్చి దిద్దోతున్నార‌ట‌. హైద‌రాబాద్‌లో స‌ర్వాంగ సుంద‌రంగా `అల్లు స్టూడియోస్‌` వుండ నుంద‌ని తెలిసింది.  దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని అల్లు ఫ్యామిలీ త్వ‌ర‌లో  వెల్ల‌డించ‌నుంద‌ట‌.