అల్లు అర్జున్ మేక‌ప్‌కి అంత టైమ్ ప‌డుతోందా?

అల్లు అర్జున్ మేక‌ప్‌కి అంత టైమ్ ప‌డుతోందా?
అల్లు అర్జున్ మేక‌ప్‌కి అంత టైమ్ ప‌డుతోందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. 80వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో బ‌న్నీ డైలీవేజ్ లేబ‌ర్‌గా పుష్ప‌రాజ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

మాసిన గ‌డ్డం.. గుబురు జుట్టు.. మీసం.. ఆయిలీ ఫేస్‌.. వెర‌సి మాస్ లారీడ్రైవ‌ర్ పాత్ర‌లో బ‌న్నీ క‌నిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ గెట‌ప్ కోసం బ‌న్నీ మేక‌ప్‌‌కి ఏకంగా మూడున్న‌ర గంట‌ల స‌మ‌యం ప‌డుతోంద‌ట‌. స్కిన్ టోన్‌, ఐబ్రోస్‌.. మాసిన గడ్డంతో ర‌ఫ్ లుక్‌లో క‌నిపించ‌డానికి ఈ స‌మ‌యం ప‌డుతోంద‌ట‌. ర‌గ్గ్‌డ్ లుక్‌లో ఊర‌మాస్ పాత్ర‌లో అల్లు అర్జున్ క‌నిపిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ త‌మిళ‌నాడులోని టెన్‌కాసిలో జ‌ర‌గ‌నుంద‌ట‌.  ఇందు కోసం ప‌ర్స‌న‌ల్ జిమ్ ట్రైన‌ర్‌, చెఫ్‌ని బ‌న్నీ త‌న వెంట తీసుకెళుతున్నార‌ట‌. అక్క‌డ ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నారట‌. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఆగ‌స్టు 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు.