డిజాస్టర్ దిశగా నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా


allu arjuns naa peru surya naa illu india towards disaster

అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది . మే 4న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజునే డివైడ్ టాక్ వచ్చింది అయితే అల్లు అర్జున్ కున్న క్రేజ్ తో ఓపెనింగ్స్ రాబట్టింది . రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ కు మంచి ఇమేజ్ ఉంది కాబట్టి కాస్తో కూస్తో కలెక్షన్లు వస్తున్నాయి కానీ బిజినెస్ జరిగింది 80 కోట్లు . అంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని కొనుక్కున్న బయ్యర్ల కు లాభాలు రాకపోయినా ఫరవాలేదు కానీ నష్టాలు రాకుండా ఉండాలంటే 140 కోట్లకు పైగా వసూల్ కావాలి .

కానీ ఇప్పటి వరకు నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా కనీసం వంద కోట్ల గ్రాస్ వసూళ్ల ని కూడా రాబట్టలేకపోయింది . ఓవర్ సీస్ లో అయితే అప్పుడే డిజాస్టర్ అయిపొయింది అలాగే మలయాళంలో అల్లు అర్జున్ కు విపరీతమైన డిమాండ్ ఉంది కానీ అక్కడ కూడా డిజాస్టర్ అయ్యింది . తెలుగులో పరిస్థితి కూడా అంతే ! అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ సినిమా విడుదలయ్యాక చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది దాంతో అల్లు అర్జున్ ఆశలన్నీ అడియాసలయ్యాయి . వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొత్తంగా బయ్యర్లకు చుక్కలు చూబెడుతోంది .