అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ `పుష్ప‌` రిలీజ్ డేట్ ఫిక్స్‌!


అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ `పుష్ప‌` రిలీజ్ డేట్ ఫిక్స్‌!
అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ `పుష్ప‌` రిలీజ్ డేట్ ఫిక్స్‌!

బ‌న్నీ హీరోగా న‌టిస్తున్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పుష్ప‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ , ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

బ‌న్నీ ఊర మాస్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ని చిత్ర బృందం గురువారం ప్ర‌క‌టించింది. ఇందు కోసం రిలీజ్ డేట్‌తో ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో పుష్ప‌రాజ్ పాత్ర‌లోని ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారా అనేంత‌గా బ‌న్నీ లుక్ గుర్తుప‌ట్ట‌ని స్థాయిలో వుంది. ఎండిన చెట్టు మొద‌లుపై గ‌ళ్ల లుంగీ.. మ‌డ‌త‌లు ప‌డి మురికి ప‌ట్టిన షార్ట్ టీష‌ర్ట్ ధ‌రించి చింపిరి జుట్టుతో చేతిలో గొడ్డ‌లి ప‌ట్టుకుని బ‌న్నీ పుష్ప‌రాజ్‌లా కూన్చుంటే అత‌ని చుట్టూ అనుచ‌రులంతా గొడ్డళ్లు పై కెత్తి ఆవేశంగా క‌నిపిస్తున్నారు.

ఈ ఒక్క స్టిల్‌తో సినిమా ఏంట‌నేది చెప్ప‌క‌నే చెప్పేశారు సుకుమార్‌. `రంగ‌స్థ‌లం`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుని స‌రికొత్త దారిని ఎంచుకున్న సుకుమార్ `పుష్ప‌` చిత్రానికి కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీ ఐదు భాష‌ల‌తో పాటు భార‌తీయ ప్ర‌ధాన భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది.