స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరుదైప రికార్డ్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరుదైప రికార్డ్‌!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరుదైప రికార్డ్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు. బ‌న్నీ న‌టించిన ఊర మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌రైనోడు` చిత్రం యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ నిర్మించిన ఈ చిత్రం సంచ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

2016లో విడుద‌లైన ఈ చిత్రాన్ని2018లో హిందీ వెర్ష‌న్‌లో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ హిందీ అనువాద చిత్రం ఈ బుధ‌వారానికి 300 మిలియ‌న్ వ్యూస్‌ని మార్కుని చేరుకుంది. అంటే ఇప్ప‌టికి 3కోట్ల మంది వీక్షించార‌న్న మాట‌. ఈ స్థాయిలో ప్రేక్ష‌కులు వీక్షించిన తొలి భార‌తీయ చిత్రంగా `స‌రైనోడు` హిందీ వెర్ష‌న్ రికార్డుని సృష్టించింది.

గ‌త ఏడాది 200 మిలియ‌న్ వ్యూస్‌ని క్రాస్ చేసిన ఈ చిత్రం ఈ ఏడాది మ‌రో 100 మిలియ‌న్ వ్యూస్‌ని క్రాస్ చేసి అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. `బాహుబ‌లి` త‌రువాత నుంచి ద‌క్షిణాది చిత్రాల‌పై మ‌రీ ముఖ్యంగా తెలుగు చిత్రాల‌పై హిందీ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిపెరుగుతోంది. దీంతో చాలా వ‌ర‌కు స్టార్ హీరోల చిత్రాల‌ని హిందీలో డ‌బ్ చేసి నిర్మాత‌లు యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ వ‌రుస‌లోనే `స‌రైనోడు` చిత్రాన్ని హిందీ వెర్ష‌న్‌లో డ‌బ్ చేస్తే  యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.