చరిత్ర సృష్టించిన సరైనోడు


allu arjuns sarrainodu sets new indian record in youtubeఅల్లు అర్జున్ నటించిన సరైనోడు సరికొత్త చరిత్ర సృష్టించింది . యు ట్యూబ్ లో 20 కోట్ల కు పైగా వ్యూస్ వచ్చాయి సరైనోడు చిత్రానికి అయితే ఇది హిందీ వెర్షన్ . యు ట్యూబ్ లో ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు కూడా ఇంతటి స్థాయిలో వ్యూస్ లభించలేదు అది ఒక్క అల్లు అర్జున్ కె సాధ్యమైంది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సరైనోడు చిత్రం రెండేళ్ల కిందట విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది . తెలుగులో భారీ విజయాన్ని సాధించిన సరైనోడు చిత్రాన్ని హిందీలో డబ్ చేశారు .

యు ట్యూబ్ లో ఈ చిత్రాన్నీ అత్యధికంగా 20 కోట్ల కు పైగా వీక్షించారు . అలాగే ఆరు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి . సరైనోడు చిత్రం తర్వాత చేసిన అల్లు అర్జున్ చిత్రాలు అంతగా ఆడటం లేదు , ఇక నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అయితే దారుణంగా ప్లాప్ అయ్యింది . దాంతో కొంత గ్యాప్ తీసుకొని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి సమాయత్తం అవుతున్నాడు . అలాగే తనకు సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బోయపాటి శ్రీను తో కూడా మళ్ళీ సినిమా చేయాలనీ ఆశిస్తున్నాడు అల్లు అర్జున్ . దర్శకులు త్రివిక్రమ్ ని కూడా లైన్లో పెట్టాడు సబ్జెక్ట్ ఎవరు ముందుగా చెబితే వాళ్లతో సినిమా చేయనున్నాడు .

English Title: allu arjuns sarrainodu sets new indian record in youtube