స్టైలిష్ స్టార్‌కి త‌గ్గ‌ స్టైలిష్ వైఫ్ అంతేగా..‌!స్టైలిష్ స్టార్‌కి త‌గ్గ‌ స్టైలిష్ వైఫ్ అంతేగా..‌!
స్టైలిష్ స్టార్‌కి త‌గ్గ‌ స్టైలిష్ వైఫ్ అంతేగా..‌!

మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్‌గా వుంటున్నారు. వారి త‌ర‌హాలోనే వారి వైఫ్‌లు కూడా అదే జోరుని కొన‌సాగిస్తున్నారు. స్టార్‌ల‌కు భారీ క్రేజ్ వున్న విష‌యం తెలిసిందే. అదే క్రేజ్ వారి వైఫ్‌ల‌కీ ఏర్ప‌డింది. దాంతో సోష‌ల్ మీడియాని ఏలేస్తున్నారు. భారీ ఫాలోయింగ్‌ని ద‌క్కించుకుంటున్నారు.

వీరి నుంచి ఓ ఫొటో లేదా ఓ వీడియో షేర్ అయ్యిందా ఫ్యాన్స్ .. నెటిజ‌న్స్ చేసే ర‌న‌చ్చ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల్లో బ‌న్నీ కూడా ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటున్నారు. ఆయ‌న త‌ర‌హాలోనే ఆయ‌న వైఫ్ స్నేహారెడ్డి కూడా సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో ఇన్ స్టాలో సంద‌డి చేస్తోంది. ‌

అర్హా, అయాన్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ని షేర్ చేస్తూ స్నేహారెడ్డి ఆక‌ట్టుకుంటున్నారు. తాజాగా సాఫ్రాన్ క‌ల‌ర్ సారీ ధ‌రించి క‌ళ్ల‌కి స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని స్టైల్‌గా ఫొటోల‌కు పోజులిచ్చిన స్నేహ‌రెడ్డి ఫొటో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆమె స్టైలిష్ లుక్‌ని చూసిన వారంతా స్టైలిష్ స్టార్‌కి త‌గ్గ‌ స్టైలిష్ వైఫ్ అంతేగా అంటూ కామెంట్ చేస్తుంటే మ‌రి కొంత మంది మేడ‌మ్ మీరు కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వండి అంటూ కామెంట్‌లు కురిపిస్తున్నారు. స్నేహారెడ్డి షేర్ చేసిన ఫొటోకి 2,55,939 మంది లైక్ చేయ‌గా 800 పైచిలుకు మంది కామెంట్‌లు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)