అల్లు అర్జున్ కోరిక నెర‌వేరేనా?

అల్లు అర్జున్ కోరిక నెర‌వేరేనా?
అల్లు అర్జున్ కోరిక నెర‌వేరేనా?

స్టార్ హీరో బ‌న్నికి అల్లు అర‌వింద్ తో ఉన్న బాండింగ్ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిసారి ఆయ‌న‌కు సంబంధించిన టాపిక్ వ‌స్తే అల్లు అర్జున్‌ ఎంతో ఎమోష‌న‌ల్ అయిపోతాడు. త‌న‌కు అర‌వింద్ లాంటి డాడ్ ఉండ‌డం అన్న‌ది పూర్వ జ‌న్మ సుకృతం అని అంటాడు. తన‌ని హీరోని చేసిన గొప్ప తండ్రిగా ఆయ‌నంటే వ‌ల్ల‌మాలిన ప్రేమాభిమానాల్నిక‌న‌బ‌రుస్తుంటారు. నిన్న (సోమ‌వారం) సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రిగిన `అల వైకుంఠ‌పుర‌ములో` ఈవెంట్ లో తండ్రి అర‌వింద్ గురించి అంతే ఉద్వేగంగా స్పందించాడు బ‌న్ని.

వేదిక‌పై బ‌న్ని మాట్లాడుతూ.. “నన్ను హీరోగా లాంచ్‌ చేసింది నాన్నే. కానీ ఈ రోజు ఆయనకు థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్‌ కేవలం నాతో సినిమా చేసినందుకు కాదు.. కొడుకు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే. నేను మా నాన్నంత గొప్పగా ఎప్పుడూ కాలేనేమో. కనీసం నాన్నలో సగం ఎత్తుకు ఎదిగితే చాలనే ఫీలింగ్‌ కలుగుతుంది. మా నాన్నను నేను ప్రేమించినంతగా మరేవరినీ ప్రేమించను. నేను ‘ఆర్య’ సినిమా చేసినప్పుడు అప్పట్లోనే కోటి రూపాయలు సంపాదించుకున్నాను. పెళ్లైన తర్వాత నా భార్యను ఒకటే అడిగాను. నాకు ఎన్ని కోట్లు ఉన్నా.. మా నాన్న ఇంట్లోనే ఉంటాను అని. మా నాన్నంటే అంత ఇష్టం.` అని అల్లు అర‌వింద్‌పై త‌న‌కున్న ప్రేమ‌ని అభిమానుల సాక్షిగా వ్య‌క్త‌ప‌రిచారు.

అల్లు అర‌వింద్ గురించి మ‌రిన్ని విశేషాలు తెలియ‌జేస్తూ ` నేను చూసిన వారిలో ది బెస్ట్‌ పర్సన్‌ మా నాన్నే. 45 ఏళ్లుగా ఆయన సినిమాలు, వ్యాపారం చేస్తున్నారు. మనిషిలో ప్యూరిటీ లేకపోతే ఇంతకాలం సౌత్‌ ఇండియాలో, ఇండియాలో నంబర్‌ వన్‌ ప్రొడ్యూసర్‌గా ఉండలేరు. మా తాతగారికి పద్మశ్రీ వచ్చింది. అలాగే మా నాన్నగారికి కూడా పద్మశ్రీ రావాలనే కోరిక నాకు ఉంది. కాబట్టి మా నాన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సభావేదిక నుండి ప్రభుత్వాన్ని అభ్య‌ర్థిస్తున్నాను`అని త‌న మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు, మరి బ‌న్నీ కోరిక‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు ఎంత వ‌ర‌కు ప‌ట్టించుకుంటారో చూడాలి.