పూజా హెగ్డేకు అల్లు అర‌వింద్ స‌ల‌హా!

Allu Arvind marriage comments on Pooja Hegde
Allu Arvind marriage comments on Pooja Hegde

స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేకి అదిరిపోయే స‌ల‌హా ఇచ్చారు. పెళ్లి చేసుకుని హైద‌రాబాద్‌లోనే సెటిలైపొమ్మ‌న్నారు. వివార‌ల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై అల్లు అర‌వింద్, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

గ‌త ఏడాది సంక్రాంతికి జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. బ‌న్నీ కెరీర్‌లోనే తొలి ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. సాంగ్స్ విష‌యంలోనూ ఈ మూవీ రికార్డ్స్ ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతూనే వున్నాయి. బాలీవుడ్ వ‌ర్గాల్లోనూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచిన ఈ మూవీ ఈ మంగ‌ళ‌వారంతో ఏడిది పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా చిత్ర బృందం రియూనియ‌న్ బాష్‌ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్రమంలో హీరో బ‌న్నీతో పాటు క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొంది.

ఈ సంద‌ర్భంగా సినిమా గురించి మాట్లాడిన అల్లు అర‌వింద్ ఈ సంద‌ర్భంగా పూజా హెగ్డేకి క్రేజీ స‌ల‌హా ఇచ్చారు. ఈ సినిమాతో అందాల సుంద‌రి పూజా హెగ్డే ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌ని ఊపేసింద‌ని కామెంట్ చేశారు. హిందీలో త‌న‌కు చాలా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని తెలిసింద‌ని, అయితే టాలీవుడ్ వ‌దిలి వెళ్లొద్ద‌ని హైద‌రాబాద్‌లోనే వుండ‌పొమ్మ‌న్నారు. కావాలంటే తెలుగబ్బాయిని పెళ్లాడాల‌ని స‌ల‌హా ఇచ్చారు. అలా అయితేనే పూజా బాలీవుడ్ వెళ్ల‌ద‌ని, ఇక్క‌డే వుంటుంద‌ని న‌మ్ముతామ‌న్నారు. అల్లు అర‌వింద్ స‌ల‌హాని పూజా పాటిస్తుందా?  చూడాలి అంటున్నారు.