అల్లు అర‌వింద్ 7 కోట్లు వ‌ద్ద‌న్నారా?


Allu arvind rehects to 7cores offer
Allu arvind rehects to 7cores offer

అల్లు అర్జున్ హీరోగా మాట‌ల మాంత్రికుడు రూపొందించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యానర్స్‌పై అల్లు అర‌వింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ప‌బ్లిసిటీ ప‌రంగా పీక్స్‌లో ప్రచారం చేయ‌డం… సినిమాలో కంటెంట్‌తో పాటు త‌మ‌న్ అందించిన సంగీతం సినిమాకు మ‌రింత ప్లస్‌గా మారింది. దీంతో ఈ సినిమాపై ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌ని ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ త్రివిక్ర‌మ్‌కు భారీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. ఆ ఆఫ‌ర్ 7 కోట్లు. ఓన్లీ రీమేక్ రైట్స్‌కే ఈ అమౌంట్‌. ఆఫ‌ర్ న‌చ్చ‌డంతో హిందీ రీమేక్ హ‌క్కుల్ని స‌ద‌రు సంస్థ‌కు ఇవ్వ‌డానికి త్రివిక్ర‌మ్ సుముఖ‌త‌ను వ్య‌క్తం చేశాడ‌ట‌. అయితే ఈ ఆఫ‌ర్‌ని అల్లు అర‌వింద్‌కి వివ‌రిస్తే త‌ను మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లోనూ రీమేక్ హ‌క్కుల్ని వేరే వారికి ఇవ్వ‌న‌ని తేగేసి చెప్పిన‌ట్టు తెలిసింది.

స్వ‌యంగా ఆయ‌నే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఆ మ‌ధ్య `గ‌జిని` చిత్రాన్ని రీమేక్ చేసి బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించారు. ప్ర‌స్తుతం దిల్ రాజుతో క‌లిసి `జెర్సీ` చిత్రాన్ని షాహీద్‌క‌పూర్‌తో రీమేక్ చేస్తున్నారు. అదే లైన్‌లో `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీనికి సంబంధించి హీరోల‌తో ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా జ‌రుపుతున్నార‌ని తెలిసింది.