అల్లు శిరీష్ టిక్ టాక్ హంగామా!


అల్లు శిరీష్ టిక్ టాక్ హంగామా!
అల్లు శిరీష్ టిక్ టాక్ హంగామా!

క‌రోనా ఎఫెక్ట్‌తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ని విధించిన విష‌యం తెలిసిందే. దీంతో అంతా ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. లా టైమ్‌ని ఒక్కొక్క‌రు ఒక్కోలా స్పందిస్తూ ఆ క్వారెంటైన్ టైమ్‌ని గ‌డిపేస్తున్నారు. బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఇంటి నుంచే అభిమానుల‌తో ట‌చ్‌లో వుంటున్నారు. ఈ స‌మ‌యంలో స్టార్స్‌కి సోష‌ల్ మీడియా చాలా హెల్ప్ అవుతోంది.

దీంతో ఒక్కొక్క‌రు ఒక్కో త‌ర‌హా వీడియోల‌తో ఫ్యాన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, మ‌హేష్ నిత్యం సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ని, నెటిజ‌న్స్‌ని క‌రోనా వైర‌స్‌పై మోటివేట్ చేస్తూ జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు. కొంత మంది మాత్రం సోష‌ల్ మీడియాలో ఎన్ని వుంటే అన్నింటిని వాడేస్తున్నారు. తాజాగా స్టార్‌ల హంగామా టిక్ టాక్‌ని తాకింది.

అల్లు శిరీష్ టిక్ టాక్ వేదిక‌గా ఫ్యాన్స్‌తో ఇంట‌రాక్ట్ కాబోతున్నారు. త‌న కొత్త సినిమా క‌బుర్ల‌తో పాటు ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో చెప్ప‌బోతున్నాడు. శుక్ర‌వారం సాయంత్ర 5 గంట‌ల‌కు లైవ్లో నెటిజ‌న్‌ల‌కు, అభిమానుల‌కు అందుబాటులో వుంటాన‌ని, త‌న‌తో ఎవ‌రైనా ఛాట్ చేయొచ్చ‌ని ఓ వీడియోని రిలీజ్ చేశాడు. దీంతో అత‌ని కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. 5 గంట‌లకు టిక్ టాక్‌లో శిరీష్ చేయ‌బోతున్న హంగామా ఎలా వుంటుందో తెలియాలంటే టిక్ టాక్‌లోకి వెళ్లాల్సిందే.