అల్లు బ్రదర్స్ కోరిక ఆ రకంగా తీరింది


అల్లు బ్రదర్స్ కోరిక ఆ రకంగా తీరింది
అల్లు బ్రదర్స్ కోరిక ఆ రకంగా తీరింది

తెలుగు సినిమాల్లో లేటెస్ట్ సెన్సేషనల్ సింగర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సిద్ శ్రీరామ్. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన సిద్ శ్రీరామ్ ముఖ్యంగా చిన్న సినిమాలకు పెద్ద దిక్కు అయ్యాడు. సిద్ శ్రీరామ్ తో ఒక్క పాట పాడిస్తే చాలు తమ సినిమా సూపర్ హిట్ అనే భావనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. అంతే కాకుండా బిజినెస్ పరంగా కూడా ఆ సాంగ్ సెన్సేషన్ అయి బాగా ఉపయోగపడుతోంది. సిద్ శ్రీరామ్ కెరీర్ లో అత్యంత పెద్ద హిట్ అంటే ఇదివరకు గీత గోవిందం సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలే సినిమా గురించి చెప్పేవాళ్ళు. గీత గోవిందంపై అందరి దృష్టి పడటానికి ఉపయోగపడిన సాంగ్ అది. ఆ సినిమా ఆడియో వేదికలో అల్లు అర్జున్ సిద్ శ్రీరామ్ కు ఇంప్రెస్ అయి తన సినిమాలో సిద్ శ్రీరామ్ చేత పాట పాడించుకోవాలని డిసైడ్ అయ్యాడు. అలాగే అల్లు బ్రదర్ అల్లు శిరీష్ కూడా తన సినిమాకు సిద్ శ్రీరామ్ పాట ప్లస్ అవుతుందని భావించాడు.

ముందుగా అల్లు శిరీష్ తన abcd సినిమాలో మెల్లమెల్లగా అనే పాట పాటిస్తే అది సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు ఆ సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది ఈ పాట అనే చెప్పాలి. సినిమా ప్లాప్ అయినా సిద్ శ్రీరామ్ పాట తన సినిమాలో ఉండాలన్న కోరిక అయితే తీరిపోయింది. ఇక అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఏదైనా సాంగ్ ను సిద్ తో పాడించమని థమన్ ను కోరగా, సామజవరగమన సాంగ్ ను సిద్ కు ఇచ్చాడు. ఇది ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇప్పటికే 85 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డులన్నీ తిరగరాసింది. ఇప్పుడు సిద్ శ్రీరామ్ అతిపెద్ద హిట్ సాంగ్ ఏదంటే ఈ పాట గురించే చెప్పుకోవాలి.

ఈ రకంగా అల్లు బ్రదర్స్ కోరిక తీరిందని ఫిల్మ్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.