అల్లు శిరీష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మంత్ర‌! 

Allu Sirish entertain mantra can work out
Allu Sirish entertain mantra can work out

అల్లు అర‌వింద్‌.. ఈ స్టార్ ప్రొడ్యూస‌ర్‌కు ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ రేటు ఎక్కువే. అల్లు అల్లు అర‌వింద్ నిర్మాత‌గా స‌క్సెస్‌, అల్లు అర్జున్ స్టార్ హీరోగా సూప‌ర్ స‌క్సెస్‌.. అయితే ఆ ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న అల్లు శిరీష్ మాత్రం ఆ ఇద్ద‌రి స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోతున్నారు. తొలి సినిమా `గౌర‌వం`తో హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఫ‌లితం లేకుండా పోయింది. ఆ త‌రువాత మారుతి హిట్ ఇవ్వాల‌ని చేసిన ప్ర‌య‌త్న‌మూ వృధానే అయింది.

ప‌ర‌శురామ్ చేయిన `శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు`తో హిట్‌ని అందుకున్నా దాన్ని కొన‌సాగించ‌లేక‌పోయారు. కొరియ‌న్ ఫిల్మ్ ఆధారంగా చేసిన ఒక్క క్ష‌ణం, మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `ఏబీసీడీ` చిత్రాలు ఆశించిన ఫలితాల్ని అందించ‌లేక‌పోయాయి. `ఏబీసీడీ` గ‌త ఏడాది మే 17న విడుద‌లైంది. ఆ త‌రువాత అల్లు శిరీష్ సినిమా ప్ర‌క‌టించి దాదాపు ఏడాది కావ‌స్తోంది.

తాజాగా అల్లు శిరీష్ సీరియ‌స్ సినిమాల్ని ప‌క్క‌న పెట్టి ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రాల్ని చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే ఓ చిత్రాన్ని సైలెంట్‌గా మొద‌లుపెట్టిన‌ట్టు తెలిసింది. `విజేత‌` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన రాకేష్ శ‌శి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మ‌క చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాతో శిరీష్ విజ‌యాల బాట ప‌డ‌తారేమో చూడాలి.