వచ్చే వారం 3 చిత్రాల పోటీ


మే 17 న మూడు చిత్రాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి . అల్లు శిరీష్ నటించిన ఎబిసిడి చిత్రంతో పాటుగా ఎంతవారలైనా , రొమాంటిక్ క్రిమినల్స్ అనే చిత్రాలు విడుదల కానున్నాయి . అలాగే వీటితో పాటుగా మరో రెండు మూడు చిన్న చిత్రాలు కూడా థియేటర్ లు దొరికితే రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి . అయితే మే 9 న మహేష్ బాబు నటించిన మహర్షి రిలీస్ కావడంతో థియేటర్ ల సమస్య ఉంది . దాంతో మూడు చిత్రాలైతే విడుదల కావచ్చు .

అల్లు శిరీష్ కు ఇది మంచి సమయం ఎందుకంటే మహర్షి చిత్రానికి సాలిడ్ హిట్ టాక్ లభించలేదు దాంతో ఏబీసీడీ ఏమాత్రం బాగున్నా వేసవి సెలవులు ఉన్నాయి కాబట్టి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది . లేకపోతె షరా మాములే ! ఇక రొమాంటిక్ క్రిమినల్స్ అని ఓ బి గ్రేడ్ సినిమా వస్తోంది అది పోటీ కాదు కానీ బిసి కేంద్రాల్లో ఛాన్స్ ఉండొచ్చు . ఇక ఎంతవారలైనా అనే సినిమా కూడా వస్తోంది కానీ దాని పై అంతగా అంచనాలు అయితే లేవు . ఈ మూడు చిత్రాల్లో ఏదైనా సత్తా చాటే అవకాశం ఉందేమో చూడాలి .