మెగా హీరోకు అవమానం


allu sirish is not a part in suriyas filmమెగా హీరో అల్లు శిరీష్ కు అవమానం జరిగింది , అల్లు శిరీష్ ని సూర్య హీరోగా నటించనున్న చిత్రంలో ఓ ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ కోసం తీసుకున్నారు దర్శకులు కేవీ ఆనంద్ . తమిళ స్టార్ హీరో సూర్య చిత్రంలో నటించే ఛాన్స్ రావడం అందునా మంచి పాత్ర లభించడంతో చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు పైగా ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాడు కూడా . కట్ చేస్తే తాజాగా ఆ సినిమాలో అల్లు శిరీష్ ని తీసేసారు అతడి స్థానంలో తమిళ హీరో ఆర్య ని తీసుకున్నారు అంతేకాదు షూటింగ్ కూడా జరుగుతోంది .

కానీ అల్లు శిరీష్ మాత్రం నేనే సూర్య సినిమా నుండి తప్పుకున్నానని ఎందుకంటే నేను ” ఏబీసీడీ ” చిత్రంలో నటిస్తున్నానని అదే సమయంలో సూర్య సార్ సినిమాకు డేట్స్ ఇవ్వాల్సి రావడంతో కుదరలేదని అందుకే ఆ సినిమా నుండి తప్పుకున్నానని అంటున్నాడు . అంతేగాదు నాకు సూర్య సార్ , కెవి ఆనంద్ గారు ఇచ్చిన మంచి ఛాన్స్ వినియోగించు కోలేక పోయానని కానీ భవిష్యత్ లో అలాంటి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ఉపయోగించుకుంటానని తెలిపాడు అల్లు శిరీష్ . ఈ హీరో చెబుతున్నది ఒకలా ఉంది సూర్య సినిమా తాలూకు ఒపీనియన్ మరోలా ఉంది దాంతో అల్లు శిరీష్ స్థానంలో ఆర్య అయితేనే బాగుంటుందని అల్లు శిరీష్ ని తప్పించారట .

English Title: allu sirish is not a part in suriyas film