కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతానంటున్న అల్లు శిరీష్


Allu Sirish making commercial success

ఇప్పటి వరకు ఏడాదికి ఓక సినిమా మాత్రమే చేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం రియలైజ్ అయ్యాను ఇక నుండి ఎక్కువ సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతానని అంటున్నాడు అల్లు శిరీష్. రేపు ఈ యంగ్ హీరో పుట్టినరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  Abcd మలయాళం రీమేక్ సూర్య కేవీ ఆనంద్ చిత్రం జులై 1న లండన్ లో ప్రారంభం కథలో కీలకమైన పాత్ర, లైకా ప్రొడక్షన్స్ …. సూర్య ల సొంత సినిమా . నేను నటించిన ఒక్క క్షణం కేవీ ఆనంద్ గారికి బాగా నచ్చింది ఆ సినిమా చూసి నన్ను ఎంపిక చేశారు. మలయాళ రిమేక్ లో మార్పులు చేయడం లేదు. తెలుగులో కథలు లేక కాదు కాని ఆ మలయాళ సినిమా నన్ను రెండు మూడేళ్ళుగా హంట్ చేస్తూనే ఉంది అందుకే రిమేక్ చేయడానికి ముందుకు వచ్చాను.

 

తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా చేయాలని ఉంది అందుకే మలయాళంలో చేసినా , ఇప్పుడు తమిళంలో చేస్తున్నా ….. మన టేకింగ్ కి తమిళ , మలయాళ టేకింగ్ కి చాలా తేడా ఉంటుంది. సొంత బ్యానర్ లో కేవలం మెగా ఫ్యామిలీ హీరోలతోనే చేయాలి అని అనుకోవడం లేదు ఇతర హీరోలతో కూడా చేస్తాం . అందులో భాగంగానే విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేస్తున్నాం . ఇక మా బ్యానర్ లో వస్తున్న కథల్లో నాకు ఏది సెట్ అవుతుందో దాన్ని మాత్రమే నాకు చెబుతారు అంతేకాని వచ్చిన అన్ని కథలు నేను వినను అని అంటున్నాడు బర్త్ డే బాయ్ అల్లు శిరీష్.