ఏబీసీడీ ట్రైలర్ ఎలా ఉందంటే


అల్లు శిరీష్ హీరోగా నటించిన ” ఏబీసీడీ ” చిత్ర ట్రైలర్ ని ఈరోజు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసారు హైదరాబాద్ లో . సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 17 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అల్లు శిరీష్ సరసన రుక్సాన్ నటిస్తోంది . మలయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు .

ఇక ఈ ఏబీసీడీ చిత్ర ట్రైలర్ విషయానికి వస్తే ప్రేక్షకులను అలరించేలా రూపొందింది అని చెప్పడంలో సందేహం లేదు . యాక్షన్ తోపాటుగా వినోదాన్ని అలాగే ప్రేమ ని కలగలిపి రూపొందించారు . మొత్తానికి వినోదానికి అగ్ర తాంబూలం ఇచ్చిన ఈ సినిమాపై అల్లు శిరీష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఎందుకంటే హీరోగా పరిచయమై చాలా కాలం అవుతోంది కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేక పోయాడు పాపం . మరి ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి .