యాంకర్ గా రాణిస్తున్న అల్లు శిరీష్


అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న తనయుడు అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ కొట్టలేకపోతున్నాడు . శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మాత్రం హిట్ అందుకున్నాడు ఈ హీరో కొత్త జంట తో ఫరవాలేదని పించాడు కానీ ఒక్క క్షణం తో మళ్ళీ నిరాశపరిచాడు . అయితే యాంకర్ గా మాత్రం బాగానే రాణిస్తున్నాడు అల్లు శిరీష్ . ఇప్పటికే పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరి మెప్పు పొందిన శిరీష్ తాజాగా పింక్ విల్లా ఛానల్ కోసం ఓ షో చేస్తున్నాడు . 
 
రిడ్లింగ్ విత్ అల్లు శిరీష్ అనే షోకి యాంకర్ గా చేస్తున్నాడు అల్లు శిరీష్ , ఈ షో కోసం మొదటిగా హాట్ భామ సీరత్ కపూర్ ని ఇంటర్వ్యూ చేసాడు . ఈ షో మంచి ఎంటర్ టైన్ మెంట్  తో సాగడంతో అందరూ సంతోషిస్తున్నారు . హీరోగా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ యాంకర్ గా మాత్రం సక్సెస్ అవుతున్నాడు .