ఎబిసిడి ట్రైలర్


అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” ఎబిసిడి ”. మధుర శ్రీధర్ , యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నాడు . మే 17 న ఎబిసిడి చిత్రాన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది . ఆ వేడుకలో న్యాచురల్ స్టార్ నాని ట్రైలర్ ని విడుదల చేసాడు .

ఎబిసిడి ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు . వినోద భరితంగా ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది . ఈ వేసవిలో తప్పకుండా ప్రేక్షకులను అలరించే చిత్రం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ చిత్ర బృందం . ఇక అల్లు శిరీష్ కూడా ఎబిసిడి చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు ఎందుకంటే సాలిడ్ హిట్ కొట్టాలని . ట్రైలర్ బాగుంది , ఎంటర్ టైన్ మెంట్ ఉంది దాంతో హిట్టు కొట్టినా కొట్టొచ్చు !