అమలా పాల్ ఎంతో త్యాగం చేసిందట !


Amala Paul
Amala Paul

ఆడై అనే తమిళ చిత్రం లో రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించడమే కాకుండా తిరిగి ఎదురు డబ్బులు కట్టి మరీ ఈ సినిమాని విడుదల చేసిందట అమలా పాల్ . రత్నకుమార్ దర్శకత్వంలో అమలా పాల్ నటించిన ” ఆడై ” చిత్రాన్ని ఈనెల 19 న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు . అయితే ఫైనాన్షియర్ ల దగ్గర తీసుకున్న డబ్బులు ఆ నిర్మాత చెల్లించకపోవడంతో ఆడై సినిమా విడుదల ఆగిపోయింది .

తాను ఎంతో కస్టపడి , ఇష్టపడి నటించిన సినిమా ఆగిపోవడంతో స్వయంగా రంగంలోకి దిగిన అమలా పాల్ ఆడై సినిమాలో నటించినందుకు రెమ్యునరేషన్ తీసుకోక పోగా ఫైనాన్షియర్ లకు కట్టాల్సిన డబ్బులతో కొంత భాగం తానే కట్టేసి సినిమాని విడుదల చేసిందట . అయితే తమిళనాట ఈ సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయి కానీ తెలుగులో మాత్రం ఆమె సినిమా అంతగా ఆడటం లేదు అందుకు కారణం సకాలంలో సినిమా విడుదల కాకపోవడమే ! పాపం ! ఎంత త్యాగం చేసినా అమల పాల్ కష్టం వృధా అవుతోందే !