అమలా పాల్ ట్రైలర్ తో అంచనాలు పెంచింది


Amala paul aadai trailer out
Amala paul aadai trailer out

అమలా పాల్ తాజాగా ఆడై చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఈ సినిమా ఇప్పటికే టీజర్ తో సంచలనం సృష్టించగా తాజాగా ట్రైలర్ తో ఆ అంచనాలను మరింతగా పెంచింది . ఈనెల లోనే తెలుగు , తమిళ బాషలలో విడుదలకు సిద్దమయ్యింది ఆడై . తమిళంలో ఆడై కాగా తెలుగులో ఆమె గా వస్తోంది . ఇక ఏ ట్రైలర్ తమిళంలో విడుదల కాగా మంచి స్పందన వస్తోంది .

ఇక తెలుగులో కూడా ట్రైలర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . టీజర్ లో నగ్న షో చేసి షాక్ ఇచ్చిన అమలా పాల్ ఈ ట్రైలర్ లో మాత్రం సిగరెట్ తాగుతూ మందు తాగుతూ మగాళ్ల మధ్య గోల చేస్తూ సందడి చేసింది . పెళ్లి కి ముందు కాస్త గ్లామర్ గా నటించిన అమలా పాల్ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం రెచ్చిపోయి నటిస్తోంది .