నగ్నంగా నటిస్తే తప్పేంటి అంటున్న అమలా పాల్


Amala Paul
Amala Paul

నగ్నంగా నటిస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్న వేస్తోంది అమలా పాల్ . తాజాగా ఈ భామ ఆడై అనే తమిళ చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ఆడై చిత్రాన్ని తెలుగులో ఆమె పేరుతో డబ్ చేస్తున్నారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ .

కాగా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఈ భామ నగ్నంగా నటిస్తే తప్పేంటి ? ఎంతసేపు నగ్న షో అని అంటున్నారు కానీ ఆ సీన్ సినిమాకు ఎంత అవసరమో సినిమా చూస్తే తెలుస్తుంది అని క్లాస్ తీసుకుంటోంది .క్యారెక్టర్ కోసం , కథ కోసం నగ్న షో చేయడానికి ముందు ముందు కూడా నేను సిద్ధం అని అంటోంది అమలా పాల్ . ఆమె , ఆడై చిత్రాలు తెలుగు , తమిళ భాషల్లో ఈనెల 19 న విడుదల అవుతున్నాయి . ఇక సినిమా విడుదల అయ్యాక కానీ తెలీదు అమలా పాల్ నగ్న షో కథ డిమాండ్ మేరకే చేసిందా ? లేదా ? అన్నది .