అమలా పాల్ మాజీ భర్త రెండో పెళ్లి


Amala Paul Ex Husband AL Vijay Marriage with Aishwarya
Amala Paul Ex Husband AL Vijay Marriage with Aishwarya

ప్రముఖ దర్శకుడు .ఎల్‌. విజయ్‌ రెండో వివాహం చేసుకున్నారు. వైద్యురాలు ఆర్‌. ఐశ్వర్యను ఆయన మనువాడారు. గురువారం కుటుంబ సభ్యుల సమక్షంలో చెన్నైలో ఈ శుభకార్యం జరిగింది. విజయ్‌ పెళ్లి ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూన్‌ 29న విజయ్‌ తన రెండో పెళ్లికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆర్‌. ఐశ్వర్యను వివాహం చేసుకోబోతున్నానని తెలపడం చాలా సంతోషంగా ఉంది. జులైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో మా పెళ్లి జరగనుంది. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమతో నా జీవితంలో కొత్త అధ్యయనాన్ని మొదలు పెట్టబోతున్నా. ఇది పెద్దలు కుదిర్చిన వివాహంఅని ఆయన పేర్కొన్నారు.

2014లో విజయ్‌.. కథానాయిక అమలాపాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. 2017లో విడాకుల తర్వాత విజయ్‌ తన మాజీ భార్య గురించి మీడియా ముందు మాట్లాడాతూ ..  ‘ఇద్దరి మధ్య నమ్మకం, నిజాయతీ కొరవడిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. నమ్మకంలేని బంధానికి విలువలేదుఅమలాపాల్‌తో విడిపోయే రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదుమరో దారిలేదు.. ఈ బాధను భరించాల్సిందే’.. అని  విజయ్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు..!!