నగ్నంగా నటించి షాక్ ఇచ్చిన అమలా పాల్


aame
aame

అమలా పాల్ నగ్నంగా నటించి అందరికి షాక్ ఇచ్చింది . రత్నకుమార్ దర్శకత్వంలో అమలా పాల్ నటించిన ఆదై చిత్రాన్ని తెలుగులో ఆమె పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే నిన్న సాయంత్రం ఆమె టీజర్ రిలీజ్ అయ్యింది . ఆ టీజర్ చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు ఎందుకంటే ఆ టీజర్ లో అమలా పాల్ న్యూడ్ గా ఉంది . సమకాలీన కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై టీజర్ తో భారీ అంచనాలు నెలకొనేలా ఉన్నాయి .

అమలా పాల్ పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చాక ఇలాంటి సన్నివేశంలో నటిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు , కానీ కథ కోసం క్యారెక్టర్ కోసం నగ్నంగా నటించడానికి సిద్దమే అని ఆమె చిత్రంతో నిరూపిస్తోంది ఈ భామ . టీజర్ తో సంచలనం సృష్టించిన అమలా పాల్ రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి .