విజయ్ చాలా మంచివాడు..అమలా పాల్!!


amala paul al vijay

2014లో అమల, విజయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2017లో విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు, తన మాజీ భర్త,  ఏఎల్‌ విజయ్ రెండో పెళ్లిపై స్పందించారు నటి అమలా పాల్‌

విజయ్‌ చాలా మంచి వ్యక్తి. ఆయన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానుఅని ఆమె ప్రధాన పాత్రలో నటించినఆమెసినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా విజయ్‌ పెళ్లిపై మాట్లాడారువిజయ్‌తో విడాకులు తీసుకున్నాక తన సినీ కెరీర్‌ ఏమైపోతుందోనని చాలా భయపడ్డానని  పేర్కొన్నారు.

నాకు చెల్లెలు, హీరోయిన్‌కు స్నేహితురాలి పాత్రల్లో నటించే అవకాశాలు మాత్రమే వస్తాయేమోనని అనుకున్నాను. మున్ముందు సినిమాల్లేక ధారావాహికల్లో నటించాల్సి వస్తుందని చాలా టెన్షన్‌ పడ్డాను. కానీ ప్రతిభ ఉంటే ఎవరూ మనల్ని ఆపలేరన్న విషయం నాకు అర్థమైందిఅని వెల్లడించారు అమల. ఇటీవల విజయ్‌కి.. ఐశ్వర్య అనే వైద్యురాలితో వివాహమైంది.