మహానటి గా నటించాల్సింది ఎవరో తెలుసా ?


Amala Paul
Amala Paul

మహానటి సావిత్రి బయోపిక్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . మహానటిగా కీర్తి సురేష్ అద్భుత నటన ప్రదర్శించింది , అయితే మహానటి గా కీర్తి సురేష్ మొదటి చాయిస్ కాదని , నేను మాత్రమే అని అంటోంది అమలా పాల్ . మహానటి తీయాలని అనుకున్నప్పుడు దర్శక నిర్మాతలు తొలుత స్పందించింది నన్ను మాత్రమే !

అయితే నాకు ఆ సమయంలో వ్యక్తిగత సమస్యలు ఉండటంతో మహానటి లాంటి గొప్ప చిత్రాన్ని చేయలేకపోయాను అని అంటోంది . నేను ఖచ్చితంగా చెప్పగలను మహానటి కి మొదటి ఛాన్స్ నాదే అని . తాజాగా ఈ భామ నటించిన ఆమె చిత్రం ఈనెల 19 న విడుదల అవుతోంది దాంతో ఆ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన అమలా పాల్ ఈ విషయాన్నీ రివీల్ చేసింది .