వెంకీ సరసన సెకండ్ హీరోయిన్ ఎవరు?వెంకీ సరసన సెకండ్ హీరోయిన్ ఎవరు?
వెంకీ సరసన సెకండ్ హీరోయిన్ ఎవరు?

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. 2019లో వెంకీ నటించిన సినిమాలు రెండూ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన విషయం తెల్సిందే. అదే ఉత్సాహంలో 2020లో నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టాడు వెంకీ. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన అసురన్ రీమేక్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. నారప్ప అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ నారప్ప చిత్ర ఫస్ట్ లుక్ కు విపరీతమైన స్పందన వచ్చిన విషయం తెల్సిందే. వయసు మళ్ళిన పాత్రలో వెంకటేష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ప్రియమణి వెంకీ భార్య పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. అక్కడి అడవుల్లో యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

అది పూర్తైన తర్వాత మరో షెడ్యూల్ అనంతపూర్ లో జరగనుంది. ఈ చిత్ర మెజారిటీ సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించబోతున్నారు. అయితే ఇద్దరు పిల్లల తండ్రిగా నటించే మధ్య వయస్కుడి పాత్రతో పాటు ఈ చిత్రంలో వెంకీ యువకుడిగానూ నటించబోతున్నాడు. ఆ పోర్షన్ వరకూ ఒక హీరోయిన్ కూడా కావాలి. కథలో కీలక మలుపుగా వచ్చే ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అన్న ఆసక్తి ఉంది. అయితే ఇప్పుడు ఆ వార్త కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అమల పాల్ నటించనున్నట్లు తాజా సమాచారం.

మధ్య వయస్కుడి పాత్రకు కరెక్ట్ గా సరిపోయిన వెంకటేష్, యంగ్ ఏజ్ పాత్రకు ఎలా సెట్ అవుతాడా అన్న సందేహం అందరిలో ఉంది. అయితే వెంకటేష్ ఏజ్డ్ లుక్ ను మ్యాచ్ చేసినట్లు ఇది కూడా మ్యాచ్ చేయడం నారప్ప టీమ్ కు పెద్ద కష్టం కాకపోవచ్చు.